400మంది తాలిబన్ ఖైదీల విడుదల

by vinod kumar |
400మంది తాలిబన్ ఖైదీల విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్ :అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వివిధ నేరాల కింద తమ దేశంలోని జైళ్లలో మగ్గుతున్న 400మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు ఆ దేశ గ్రాండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అప్ఘన్ ప్రభుత్వానికి, తాలిబన్ నేతలకు మధ్య జరిగిన చర్చలు ఆదివారం సఫలం కావడమే ఇందుకు కారణం. అనంతరం ఆ దేశ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 25 అధికరణలతో కూడిన తీర్మానాన్ని గ్రాండ్ అసెంబ్లీ ఆమోదించింది. ఇకమీదట తమ అంతర్గత వ్యవహారాల్లో ప్రత్యక్ష, పరోక్ష జోక్యాన్ని నిలిపివేయాలని, ఉగ్రవాద సంస్థలకు సహాయచేయడం మానుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆఫ్ఘనిస్థాన్ కోరింది.

ఆఫ్ఘాన్ అంతర్గత చర్చలకు తక్షణమే రావాలని తాలిబన్లకు ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, మాజీ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఇతర రాజకీయ నేతలు పిలుపునిచ్చారు. అధ్యక్షుడు ఘనీ మాట్లాడుతూ.. తాను మిగిలిన 400 మంది తాలిబన్ ఖైదీల విడుదలకు ఈరోజే సంతకం చేస్తానని.. విడుదల కాబోయే తాలిబన్లు తిరిగి యుద్ధం చేయబోరని, వారి కార్యకలాపాలపై పర్యవేక్షణ ఉంటుందని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి, ప్రజలకు హామీ ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది.

Advertisement

Next Story