మారణకాండ.. మందుపాతర పేల్చిన మావోయిస్టులు

by Anukaran |   ( Updated:2021-03-23 08:28:48.0  )
మారణకాండ.. మందుపాతర పేల్చిన మావోయిస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా కన్హార్ గ్రామంలో మావోయిస్టులు మారణకాండ సృష్టించారు. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న బస్సును ఐఈడీతో పేల్చివేశారు. ఈ దాడిలో ఐదుగురు అమరులవ్వగా, డ్రైవర్ సహా నలుగురు డీఆర్జీ జవాన్లు ఉన్నారు. మృతులను ప్రార్ పవన్ మాండవి, జయలాల్ యుకే కానిస్టేబుల్, వందనం కానిస్టేబుల్ డ్రైవర్, కరణ్ డెహారీ అసిస్టెంట్ కానిస్టేబుల్, విజయ్ పటేల్‌లుగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది సైనికులు ఉండగా, 20 మందికి పైగా సైనికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణపూర్‌లో జరిగిన దాడిలో అక్కడికక్కడే ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించినట్లు డీజీ నక్సల్ ఆపరేషన్ అశోక్ జునేజా ధృవీకరించారు. కాగా, ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ స్పందించారు. నక్సలైట్లు సృష్టించిన మరణకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అమరవీరులకు సంతాపం వ్యక్తంచేయడమే కాకుండా, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed