జనతా కర్ఫ్యూ: 3700 రైళ్లు రద్దు

by Shamantha N |
జనతా కర్ఫ్యూ: 3700 రైళ్లు రద్దు
X

కరోనా మహమ్మారి నివారణ చర్యలు, అవగాహనలో భాగంగా ఆదివారం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 3700 ప్యాసింజర్, సుదూర ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు దేశంలోని ఏ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలు ఉండవని తెలిపింది. అత్యవసర పరిస్థితిలో రవాణాను దృష్టిలో ఉంచుకొని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్‌ల్లో తక్కువ స్థాయిలో సబర్బన్ రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. ఎన్ని రైళ్లను నడపాలనే విషయమై ఆయా జోన్లు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అంటే… దాదాపు 14 గంటలపాటు ఇల్లు, గృహ సముదాయాలను విడిచి బయటకు రావొద్దని సూచించారు.

Tags: 3,700 trains,cancelled,Sunday,Janata curfew

Advertisement

Next Story

Most Viewed