- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డ్రంక్ అండ్ డ్రైవ్.. 353 మందికి జైలు శిక్ష : సీపీ సజ్జనార్
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన 353 మందికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు కమిషనర్ సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 353 మంది పట్టుబడ్డారని, వారిని కోర్టుకు పంపగా 20 రోజులు జైలు శిక్షణను విధిస్తూ తీర్పునిచ్చిందన్నారు.
కూకట్పల్లిలో 79, మియాపూర్ 60, మాదాపూర్ 41, బాలానగర్ 49, రాజేంద్రనగర్ 30, శంషాబాద్ 24, గచ్చిబౌలిలో 50 మంది మందు బాబులకు జైలు శిక్ష విధించిందని తెలిపారు. వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కు ఆర్టీవో అధికారులకు లేఖను పంపనున్నట్లు వెల్లడించారు.
Next Story