- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోన్ యాప్స్‌లో రూ.320 కోట్లు ఫ్రీజ్: అంజనీకుమార్
దిశ, క్రైమ్ బ్యూరో : లోన్ యాప్స్ వ్యవహారంలో హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకూ రూ.320 కోట్లు ఫ్రీజ్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. బషీర్ బాగ్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్ లైన్ లోన్ యాప్ కేసులో ఇప్పటి వరకూ 20 మందిని అరెస్టు చేశామన్నారు. దేశ వ్యాప్తంగా లోన్ యాప్ బాధితులు ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో దేశంలోని 9 రాష్ట్రాలకు చెందిన పోలీసులు నగర పోలీసుల నుంచి లోన్ యాప్ కుంభకోణానికి సంబంధించిన సమాచారం తీసుకుంటున్నారని అన్నారు.
చైనీస్ ఆధారంగా నడుస్తున్న ఈ మోసంలో దాదాపు రూ.105 కోట్లు విదేశాలకు ట్రాన్స్ ఫర్ అయ్యాయని అన్నారు. ఇదిలా ఉండగా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లోన్ యాప్‌లకు సంబంధించి 13 కేసులు నమోదు కాగా, 24 మంది అరెస్టు అయ్యారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు రూ.26 కోట్లను పలు బ్యాంకుల్లో ఉన్న సొమ్మును ఫ్రీజ్ చేయించారు. గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే దాదాపు 450కి పైగా లోన్ యాప్స్ ను తొలగించాలని నగరంలోని మూడు కమిషనరేట్ల సీపీలు గూగుల్ కు లేఖ రాయగా, 200 యాప్ లను తొలగించారు.