- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హట్సాన్ పాల డెయిరీలో గ్యాస్ లీక్..
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఈ మధ్య వరుస గ్యాస్‌లీక్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.మొన్నటికి మొన్న విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌లీక్ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందగా, తాజాగా చిత్తూరు జిల్లాలోని హట్సాన్ డెయిరీలో మరో లీకేజీ ఘటన జరిగింది.ఈ ప్రమాదంలో 30 మంది కార్మికులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
వివరాల్లోకివెళితే.. చిత్తూరు జిల్లాలోని పూతపట్టు మండలం ఎం. బండపల్లిలో గల హట్సాన్ పాల డెయిరీలో గురువారం రాత్రి అమోనియం రసాయనం లీకేజీ అయింది. ఈ ప్రమాదంలో 30 మంది కార్మికులు అస్వస్థతకు గురి కాగా, అందులో ఐదుగురు బాధితులను వెల్లూరు ఆస్పత్రికి తరలించగా, మరో 25మందిని చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.