- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణా జిల్లాలో విషాదం..నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు..
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కార్తీక మాసంలో భాగంగా సోమవారం నదీస్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు నీటమునిగి గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరి యువకుల మృతదేహాలు లభ్యమవగా.. మరో యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే కార్తీక సోమవారం నాడు చాలామంది నదీస్నానాలు చేస్తుంటారు. ఈరోజు కార్తికమాసంలో వచ్చిన రెండో సోమవారం కావడంతో కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు గ్రామానికి చెందిన యువకులు నరేంద్ర, నాగరాజు, పవన్ నదీస్నానం కోసం తెల్లవారు జామున కృష్ణానదీ పాయవద్ద నదిలో దిగారు.
నీటిప్రవాహం ఎక్కువగా ఉండటంతో స్నానానికి దిగిన ముగ్గురు మునిగిపోయారు. యువకులు మునిగిపోవడాన్ని గుర్తించిన స్థానికులు గ్రామస్తులకు సమాచారం అందజేశారు. గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకునే సమయానికి నదీ ప్రవాహంలో యువకులు గల్లంతయ్యారు. గ్రామస్తులు నదీ పాయలోకి దిగి గాలింపు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. మరో యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది. యువకులు కుటుంబసభ్యులు ఘటనాస్థలం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.