ఇటలీ నుంచి భారత్‌కు 263 మంది

by Shamantha N |
ఇటలీ నుంచి భారత్‌కు 263 మంది
X

కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఇటలీ నుంచి భారతీయులు స్వదేశానికి వచ్చారు. ఇటలీలో విద్యనభ్యసిస్తున్న 263 మంది భారతీయ విద్యార్థులు ప్రత్యేక విమానంలో భారత్‌కు వచ్చారు. నేటి మధ్యాహ్నం ప్రత్యేక విమానం ఢిల్లీ చేరుకుంది. విమానంలోని వారందర్నీ ఢిల్లీలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ప్రత్యేక శిబిరానికి అధికారులు తరలించారు. అక్కడ వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. క్వారంటైన్ ముగిసిన తరువాత వారిని ఇళ్లకు పంపనున్నారు.

Tags: italy, student, screening, special flight, delhi

Advertisement

Next Story

Most Viewed