రూ.లక్ష రుణమిచ్చి.. వడ్డీ కింద 26 ఏళ్ల యువతిపై అత్యాచారం.. ఆపై..!

by Sumithra |   ( Updated:2021-08-11 08:03:56.0  )
stop-rape
X

దిశ, వెబ్‌డెస్క్ : సమాజంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. కొందరు వావివరుసలు మరిచి మహిళలపై దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుండగా.. మరికొందరు కామవాంఛలు తీర్చుకోవడానికి మహిళలను ఆర్థికంగా ఆదుకుంటూ.. వారిపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తమ కోరికలు తీర్చాలంటూ తొలుత వేధింపులకు గురిచేయడం, ఒప్పుకోని పక్షంలో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలోని పూణె నగరంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

26 ఏళ్ల యువతి ఆర్థిక ఇబ్బందుల కారణంగా అత్యవసరమై 40 ఏళ్ల కిరణ్ గారే అనే వ్యక్తి దగ్గర రూ.లక్ష అప్పు తీసుకుంది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.50 వేల చొప్పున రెండు సార్లు చెక్కు రూపంలో చెల్లించింది. అయితే, వడ్డీ (Intrest)కింద తన కామ వాంఛ తీర్చాలని వేధింపులకు గురిచేశాడు. అందుకు ఆ యువతి అంగీకరించకపోయే సరికి పూణెలోని గన్ పాయింట్ వద్ద ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను వీడియా రూపంలో చిత్రీకరించాడు. ఇలా పలుమార్లు బ్లాక్ మెయిల్ చేస్తూ బాధితురాలిపై అత్యాచారం చేశాడు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో పాటు మరో వ్యక్తి దీపక్ ఓస్వాల్ అనే వ్యక్తిని పూణె పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed