- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 గంటలపాటు కంట్రోల్‌రూం సేవలు : జీహెచ్‌ఎంసీ
దిశ, వెబ్ డెస్క్ :
కొవిడ్ నియంత్రణలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ వెబినార్ కాన్ఫ్‌రెన్స్ నిర్వహించింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి అదనపు కమిషనర్ బి.సంతోష్ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్ గైడ్‌లైన్స్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు.
క్షేత్రస్థాయిలో కరోనా నియంత్రణకు అమలుచేస్తోన్న పనులను సమన్వయం చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాలను సమన్వయం చేసేందుకు మూడు షిఫ్టుల్ల 24గంటల పాటు కంట్రోల్ రూం సేవలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారితో కంట్రోల్ రూం ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పడు వాకబు చేస్తున్నామని అవసరమైన మేరకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.