- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలేరులో కరోనా విజృంభణ
దిశ, పాలేరు: పాలేరు నియోజకవర్గంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో మొత్తంగా 21 మందికి కరోనా సోకినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ల ద్వారా 38 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 16 మందికి పాసిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇందులో కేశవాపురం గ్రామంలో రెండు, నేలపట్ల గ్రామంలో ఇద్దరికి, కూసుమంచి గ్రామంలో రెండు, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వెల్లడించారు.
ఇక నరసింహులగూడెంలో ఆరుగురికి, రాజుపేట గ్రామంలో ఒకరికి కరోనా సోకినట్టు తెలిపారు. అలాగే నేలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో 54 మందికి పరీక్షలు చేయగా, ఐదు పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్టు మండల వైద్యాధికారి డాక్టర్ రాజేష్ తెలిపారు. ఇందులో చెర్వుమాధారం గ్రామంలో ఇద్దరికి, రాజేశ్వరాపురం గ్రామంలో ఒకరికి, మండ్రాజుపల్లి గ్రామంలో ఒకరికి, ఖమ్మం జిల్లా కేంద్రంలో మరో వ్యక్తికి వైరస్ నిర్ధారణ అయినట్టు వైద్యులు వెల్లడించారు.