టీ-హబ్ కార్యక్రమం ద్వారా శిక్షణ పూర్తిచేసిన 208 మంది విద్యార్థులు

by Shyam |
T-Hub
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రారంభమైన అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ-హబ్ మొదలుపెట్టిన టి-ట్రైబ్ ద్వారా లాంచ్‌ప్యాడ్ ప్రోగ్రామ్ నుంచి మొదటి బ్యాచ్ 208 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు గురువారం ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అవసరమైన పరిజ్ఞానాన్ని అందుకోవడంతో పాటు వ్యాపార రంగంలో విజయం సాధించేందుకు వీలవుతుందని టీ-హబ్ తెలిపింది.

‘గత కొన్నేళ్లలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విద్య మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. చాలామంది యువకులు వ్యాపారంలో విజయం సాధించాలనే లక్ష్యంతో వ్యాపార మెలకువలను నేర్చుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు. టీ-ట్రైబ్ కార్యక్రమం ద్వారా విద్యార్థులను స్టార్టప్ కంపెనీల విభాగంలో తక్కువ సమయంలో ఎదిగే అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది కరోనా కారణంగా అవాంతరాలు ఎదురైనప్పటికీ లాంచ్‌ప్యాడ్ ప్రోగ్రామ్ నుంచి విద్యార్థులు శిక్షణ చేయగలిగారని’ టీ-హబ్ సీఈఓ రవి నారాయణ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed