- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > స్పోర్ట్స్ > ఐసీసీ T20 వరల్డ్ కప్-2024 > ICC World cup 2023: మహ్మద్ షమీ అరుదైన ఘనత.. తొలి బౌలర్‌గా..
ICC World cup 2023: మహ్మద్ షమీ అరుదైన ఘనత.. తొలి బౌలర్‌గా..
X
దిశ, వెబ్‌డెస్క్: ICC World cup 2023లో భాగంగా వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్లతో చెలరేగిన షమీ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వరల్డ్‌కప్ టోర్నీల్లో 45 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత బౌలింగ్ దిగ్గజాలు జహీర్ ఖాన్, జవగాల్ శ్రీనాథ్‌ను షమీ అధిగమించాడు. వీరిద్దరూ వన్డే వరల్డ్‌కప్‌లో సంయుక్తంగా 44 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ 14 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్లు హాల్, ఒక నాలుగు వికెట్ల హాల్ ఉంది.
Advertisement
Next Story