WorldCupFinal: మైదానంలో అనుమానస్పద వ్యక్తి కలకలం

by GSrikanth |
WorldCupFinal: మైదానంలో అనుమానస్పద వ్యక్తి కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ‘ఇండియా-ఆస్రేలియా’ వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి కలకలం రేపాడు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో వ్యక్తి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. ఫ్రీ పాలస్తీనా అంటూ టీషర్ట్‌, పాలస్తీనా జెండా రంగులు కలిగిన మాస్క్‌ను ధరించి గ్రౌండ్‌లో వచ్చేశాడు. సెక్యూరిటీ నుంచి తప్పించుకుని పిచ్‌ వద్ద బ్యాటింగ్ చేస్తున్న విరాట్‌ కోహ్లీని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఘటన స్టేడియంలో ఒక్కసారిగా కలకలం రేపింది. వెంటనే అతనిని సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. లోకల్ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. తన పేరు జాన్ అని, తనది ఆస్ట్రేలియా అని, తను పాలస్థీనా సపోర్టర్ అని, క్రికెటర్ విరాట్ కోహ్లీ కోసం గ్రౌండ్‌లోకి దిగానని నిందితుడు తెలిపాడు.

Advertisement

Next Story