ICC World Cup 2023: రేపు వార్మప్ మ్యాచ్‌లో ఇండియా vs నెదర్లాండ్స్ 'ఢీ'..

by Vinod kumar |
ICC World Cup 2023: రేపు వార్మప్ మ్యాచ్‌లో ఇండియా vs నెదర్లాండ్స్ ఢీ..
X

తిరువనంతపురం: మరో రెండు రోజుల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుండగా, ప్రాక్టీస్ కోసం పలు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం తిరువనంతపురం వేదికగా భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2గంటల నుంచి ప్రారంభం కానుంది. హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించొచ్చు. కాగా, ఇంగ్లాండ్‌తో భారత్ ఆడాల్సిన తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. మరోవైపు, నెదర్లాండ్ ఇప్పటికే ఆస్ట్రేలియాతో ఓ వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లోనూ వర్షం పలుమార్లు ఆటంకం కలిగించినప్పటికీ కొనసాగింది. ఇందులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

అయితే, భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు సైతం వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాతావరణశాఖ ప్రకారం, కేరళలో మంగళవారం రోజంతా వర్షం కురవనుంది. ఉదయం వేళల్లో భారీ వర్షం కురవనుండగా, మధ్యాహ్నం తర్వాత ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగిన ఈ మ్యాచ్‌ను సైతం రద్దు చేసి, ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. మొన్నటిదాకా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు మంచి ప్రాక్టీస్ లభించినందునా, ఈ మ్యాచ్ రద్దయినా పెద్దగా ప్రభావం చూపదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, వన్డే వరల్డ్ కప్ ఈ నెల 5(గురువారం) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed