- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ సందడి
దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ వేదికగా మరో వారంరోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. కేవలం టీమిండియా క్రీడాభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టోర్నమెంట్ వన్డే వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్‌ను టీమిండియా గెలవాలని ఎంతగా కోరుకుంటారో.. లైఫ్‌లో ఒక్కసారైనా కళ్లారా చూడాలని, ముట్టుకోవాలనీ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాంటి వారికోసం క్రికెట్‌ను మరింత ప్రేక్షకుల చెంతకు చేర్చేందుకు ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ టూర్‌ను ప్రారంభించింది.
జూన్ 27న భారత్‌లో ట్రోఫీని ప్రదర్శించారు. జూన్ 27 నుంచి ప్రారంభమైన ఈ టూర్‌లో వరల్డ్ కప్ ట్రోఫీ దాదాపు నాలుగు నెలల పాటు వివిధ దేశాలు తిరిగింది. ఇప్పటికే చెన్నైలో ఐసీసీ ట్రోఫీని ప్రదర్శించగా.. తాజాగా వరల్డ్ కప్ ట్రోఫీ హైదరాబాద్‌కు చేరుకుంది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ప్రజలు దీన్ని చూసేందుకు ఉంచారు. ఇవాళ ఉదయం చార్మినార్, 9 గంటలకు జింకనా గ్రౌండ్, మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంది.
Hyderabad's iconic Charminar welcomes for The ICC World Cup 2023#ICCWorldCup2023 #TeamIndia pic.twitter.com/J2rHuu7T6b
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) September 21, 2023