ఒక్క రోజులో 2,003 కరోనా మరణాలు

by vinod kumar |
ఒక్క రోజులో 2,003 కరోనా మరణాలు
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు బుధవారం రికార్డు స్థాయిలో రిపోర్డు అయ్యాయి. బుధవారం నాటి బులెటిన్‌లో కేంద్ర ప్రభుత్వం 2,003 మరణాలు అదనంగా చోటుచేసుకున్నట్టు ప్రకటించింది. దీంతో కరోనా మరణాలు ఒక్క ఉదుటున 9,900 నుంచి 11,903కు చేరాయి. రాష్ట్రాలు అదనంగా మరణాల సంఖ్యను చేర్చడంతో బుధవారం మరణాల సంఖ్య అసాధారణ స్థాయికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. గతంలో రిపోర్డు చేయని మరణాలను మహారాష్ట్ర, ఢిల్లీలు అదనంగా బుధవారం నాటి జాబితాలో చేర్చాయి. కరోనా మరణాలను ముంబయి సవరించడంతో 862 పెరిగి 3,165కి చేరాయి. కాగా, ఢిల్లీ కూడా కరోనా మరణాలను సవరించింది. దీంతో 400లకు పైగా మరణాలు అధికమై మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,800లను దాటింది. అయితే, ఈ సవరింపులు జరిపిన నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో చోటుచేసుకున్న మరణాలపై అస్పష్టత నెలకొంది. కాగా, ఒక్క రోజు వ్యవధిలో 10,974 కేసులు కొత్తగా వెలుగు చూశాయని కేంద్రం వెల్లడించింది. దీంతో దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,54,065కి చేరింది. ఇందులో 1,55,227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed