ప్లై మాస్కుల ఎగుమతిపై నిబంధనలు సడలింపు..

by Shamantha N |
ప్లై మాస్కుల ఎగుమతిపై నిబంధనలు సడలింపు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి దేశంలోనికి ప్రవేశించిన సమయంలో ప్లై మాస్కులు, మిగతా మెడికల్ కవరల్స్ కొరత తీవ్రంగా ఉండేది. దాంతో వాటి ఎగుమతులపై కేంద్రం కఠిన నిబంధనలు విధించింది. తాజాగా ప్లై మాస్కులు, ఇతర మెడికల్ పరికరాల తయారీలో దేశం సయం సమృద్ధి దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వాటి ఎగుమతిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. 2/3 ప్లై సర్జికల్ మాస్క్‌లు, అన్ని తరగతులు మరియు వివిధ వర్గాల మెడికల్ కవరల్స్ ‘పరిమితం’ నుంచి ‘ఉచిత’ వర్గానికి సవరించబడ్డాయి. దీనిప్రకారం ఈ కవరల్స్‌ను వివిధ దేశాలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎగుమతి చేయవచ్చును. కానీ, ‘మెడికల్ గాగుల్స్’ మాత్రం ‘పరిమితం’ చేయబడిన విభాగంలో కొనసాగుతున్నందున, వాటి ఎగుమతులపై ఆంక్షలు కొనసాగుతాయని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.

Advertisement

Next Story