కామాంధుడు.. పరీక్షల పేరుతో 17 మంది విద్యార్థినిలను అక్కడికి తీసుకెళ్లి..

by Anukaran |
channai
X

దిశ, వెబ్‌డెస్క్ : పాఠశాల నిర్వాహకుడు తన స్థాయిని మరిచిపోయి.. మృగంలా విద్యార్థినిలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విద్యార్థినిలకు మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చి 17 మంది పదో తరగతి విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పుర్కాజి ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తున్నాడు. అయితే, ప్రాక్టికల్ పరీక్షల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థినిలను మరో స్కూల్‌కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో లేట్ అయిందనే కారణం చెప్పి విద్యార్థినిలను రాత్రి అక్కడే నిద్రపోవాలని కోరాడు.

దీంతో ఓకే చెప్పిన స్టూడెంట్స్ రాత్రి అక్కడే ఉండిపోయారు. ఇదే అదునుగా భావించిన కామాంధుడు.. వారికి అందించిన ఆహారంలో మత్తుమందు కలిపాడు. దీంతో వారు స్పృహ కోల్పోయారు. అనంతరం పాఠశాల నిర్వాహకుడు, అతడి సహాయకుడు 17 మంది విద్యార్థినిలపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఈ విషయం బయటకు చెప్పొదంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయపడిపోయిన విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడం మానేశారు. ఈ విషయంపై పేరెంట్స్ వారిని ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. అలా 17 రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Advertisement

Next Story