- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీదర్ టు యవత్మాల్
దిశ, ఆదిలాబాద్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 160 సంచుల్లో అక్రమంగా తరలిస్తున్నగుట్కాను పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటకలోని బీదర్ పట్టణం నుంచి కొన్నాళ్లుగా అంతర్రాష్ట్ర ముఠా గుట్కా దందా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్, బీదర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు మరో ఇద్దరు ముఠాగా ఏర్పడి అక్రమ గుట్కా వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బీదర్ పట్టణం నుంచి లారీలో బియ్యం సంచుల మాటున 160 గుట్కా బ్యాగులను నిర్మల్ జిల్లా స్వర్ణ చెక్‌పోస్ట్ మీదుగా మహారాష్ట్రలోని యవత్మాల్‌కు రవాణా చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. స్వర్ణ- సిరిపల్లి గ్రామాల మధ్య గుట్కా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. నిందితులు హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ సలీం, బీదర్‌కు చెందిన అన్వర్, నాందేడ్‌కు చెందిన హమీద్, శివినికి చెందిన మతీన్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.