హీరోయిన్‌తో మిస్ బిహేవ్ చేసిన 15 ఏళ్ల యువకుడు..

by Jakkula Samataha |   ( Updated:2021-04-05 05:29:38.0  )
హీరోయిన్‌తో మిస్ బిహేవ్ చేసిన 15 ఏళ్ల యువకుడు..
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్.. ఓ అవార్డు ఫంక్షన్‌లో మైనర్ బాయ్ తనతో మిస్ బిహేవ్ చేశాడని తెలిపింది. 2018లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ కాగా, పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పింది సుస్మిత. తమ చుట్టూ బాడీగార్డులు ఉంటారు కాబట్టి, ఎలాంటి సమస్యా ఉండదని ప్రజలు అనుకుంటారని.. కానీ అది నిజం కాదని వెల్లడించింది. ఇద్దరు ముగ్గురు బాడీగార్డులు వందల మందిని డీల్ చేయలేరని, అందుకే ఇలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ చూడాల్సి వస్తుందని వివరించింది. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం ద్వారా ఇలాంటి ఇన్సిడెంట్స్‌ను హ్యాండిల్ చేయాలని మహిళలకు సూచించింది.

అవార్డు ఫంక్షన్‌కు వెళ్లిన తనతో 15 ఏళ్ల కుర్రాడు మిస్ బిహేవ్ చేయడం చూసి షాక్ అయ్యానన్న సుస్మిత.. అంత మందిలో తననెవరూ గుర్తుపట్టలేరనే అపోహతో అలా చేశాడని తెలిపింది. అంత మంది పబ్లిక్‌లోనూ తన మెడపట్టుకుని లాక్కెళ్లానని, అరిచి గోల చేస్తే అబ్బాయి పరిస్థితి ఏమవుతుందో వివరించానని చెప్పింది. దీంతో రియలైజ్ అయిన పిల్లాడు సారీ చెప్పాడని, మరోసారి ఇలాంటి తప్పు చేయనని ప్రామిస్ చేశాడని పేర్కొంది. కాగా ఇలాంటి పనులు చేయడం నేరమని ఇంట్లో వాళ్లు నేర్పించలేదనుకుని, తనపై చర్యలు తీసుకోకుండా వదిలేశానని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story