- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్కా ప్లాన్.. 15రోజుల క్రితమే ఈటల కేడర్‌తో అధిష్టానం స్కెచ్!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూల మీడియాలో ఈటలకు ప్రతికూలంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు, ఈటల అభిమానులు అధికారపార్టీపై ధ్వజమెత్తుతున్నారు.
అధికారపార్టీలో అనేకమంది నేతలపై అవినీతి మరకలున్నప్పటికీ ఈటలపైనే ఎందుకు ఫోకస్ వెళ్లిందని నిలదీస్తున్నారు. ఎన్నడూ లేనంత స్పీడ్ గా సీఎం కేసీఆర్ స్పందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈటల సానుభూతిపరులు. అభిమానులు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నుండి హైదరాబాద్ కు తరలి వెళుతున్నారు.
కాగా 15 రోజుల క్రితమే ఈటలను ఇరుకునపెట్టేందుకు అధిష్టానం ప్లాన్ రచించిందనే వార్త హుజురాబాద్ లో చర్చనీయాంశంగా మారింది. ముందునుండే ఈటల సెకండ్ కేడర్ తో అధిష్టానం పెద్దలు టచ్ లో ఉన్నారని, వారిని తమవైపుకు తిప్పుకుని వ్యూహం రచించారని సమాచారం. నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు నాయకులు 15 రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసినట్టుగా తెలుస్తోంది. అయితే అధిష్టానం పెద్దలను కలిసిన నాయకులు ఎవరనేది ఇంకా స్పష్టత లేనప్పటికీ కానీ దీనిపై ఈటల వర్గాలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది.