బ్రేకింగ్ : కరీంనగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని పరిణామం

by Anukaran |   ( Updated:2021-11-26 05:25:16.0  )
TRS vijaya garjana sabha
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 24 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం ఏకంగా 14 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్స్‌ను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 10 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్స్ విత్ డ్రా చేసుకున్న వారిలో.. పురం రాజేశం, గంగాధర శంకరయ్య, అన్నారం శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, మేకల గణేష్, మొహమ్మద్ చాంద్ పాషా, పొలాస తిరుపతి, నలుమచు రామకృష్ణ, బండం వసంత రెడ్డి, ముద్దం తిరుపతి, బొమ్మెర వేణి తిరుపతి, చీకట్ల రాజశేఖర్, మాదాసు వేణు, శీలారం సత్తయ్యలు ఉన్నారు.

ఇదిలాఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకగ్రీవం ఏమో కానీ ఫలితాలు తారుమారు కావొచ్చనే ఆందోళన ఆ పార్టీ నేతలకు పట్టుకున్నట్టు సమాచారం. కాగా, అధికార పార్టీ నుంచి ఎల్. రమణ, టి. భానుప్రసాద్‌లు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed