- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్
దిశ, ఏపీ బ్యూరో: నకిలీ పత్రాలతో వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించారన్న అభియోగాలతో అరెస్టైన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకులను అనంతపురం సబ్ జైలుకు తరలించారు. అంతకుముందు ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరు పరిచారు. వీరిద్దరిపై జేసీ ట్రావెల్స్ పేరిట ఫోర్జరీకి పాల్పడ్డారని 24 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం, తాడిపత్రి పోలీస్ స్టేషన్లో 27 కేసులు నమోదు కావడం గమనార్హం. నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలకు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఉదయం హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని తన నివాసంలో ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతపురం తరలించిన సంగతి తెలిసిందే.