శుక్రవారం పంచాంగం (13-11-2020)

by Hamsa |   ( Updated:2020-11-12 12:32:27.0  )
Panchangam
X

శుక్రవారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం

దక్షిణాయణం

శరత్ ఋతువు

నిజ ఆశ్వయుజ మాసం

బహుళ (కృష్ణ) పక్షం

తిధి : త్రయోదశి సా4.08 తదుపరి చతుర్థశి

వారం : శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం : చిత్త రా10.28 తదుపరి స్వాతి

యోగం : ప్రీతి ఉ11.16 తదుపరి ఆయుష్మాన్

కరణం : వణిజ సా4.08 తదుపరి భద్ర/విష్ఠి రా2.57 ఆ తదుపరి శకుని

వర్జ్యం : ఉ7.32 – 9.02 తిరిగి తె3.41 – 5.10

దుర్ముహూర్తం : ఉ8.21 – 9.06 తిరిగి మ12.06 – 12.51

అమృతకాలం: సా4.30 – 5.59

రాహుకాలం : ఉ10.30 – 12.00

యమగండం/కేతుకాలం: మ3.00 – 4.30

సూర్యరాశి: తుల

చంద్రరాశి: కన్య

సూర్యోదయం: 6.07

సూర్యాస్తమయం: 5.21

ధన త్రయోదశి

మాస శివరాత్రి

శ్రీ ధన్వంతరీ జయంతి

ధనత్రయోదశి :

దీపావళి పండుగలో మొదటిరోజును ధనత్రయోదశి లేదా ధంతేరాస్ గా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి తిధిన వచ్చే ఈ ధనత్రయోదశి రోజున హిందువులు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు. ధన్వంతరి పూజతో పాటు సాయంత్రం వేళ లక్ష్మీదేవికి పూజ చేయడం సంప్రదాయం. మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తారు. ఇలాంటి దీప కాంతులంటే అమ్మవారికి చాలా ఇష్టం. అంతేకాదు, దీపం అజ్ఞాన చీకటులను తరిమేస్తుందని ప్రతీది. అందువల్లే ధంతేరస్ నాడు దీపాలు వెలిగించడంతో దీపావళి మొదలవుతుంది.

ఈ రోజు పూజ చేయడానికి తెలుగువారికి సాయంత్రం 5 గంటల 41 నిమిషాల నుంచి 5 గంటల 59 నిమిషాల మధ్య దివ్యమైన ముహూర్తం ఉంది. ఈ సమయంలో పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రతీతి. ఈరోజు ఎక్కువమంది మహిళలు బంగారం లేదా వెండివస్తువులను కొంటుంటారు. వాటికి పసుపు, కుంకుమ రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచి పూలతో పూజ చేస్తారు. ఇలా చేస్తే వారికి అదృష్టం వరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story