సోమవారం పంచాంగం (12-04-2021)

by Anukaran |   ( Updated:2021-04-12 00:39:21.0  )
Panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం బహుళ పక్షం
తిధి : అమావాస్య ఉ6.55వరకు
తదుపరి శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర పాడ్యమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : రేవతి ఉ10.37 తదుపరి అశ్విని
యోగం : వైధృతి మ1.45 తదుపరి విష్కంభం
కరణం : నాగవం సా6.55 తదుపరి కింస్తుఘ్నం తె5.04
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మ12.24 – 1.13 & మ2.52 – 3.41
అమృతకాలం : ఉ8.00 – 9.44 & తె5.04నుండి
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం : ఉ10.30 – 12.00
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 5.50
సూర్యాస్తమయం : 6.10

రాశి ఫలితాలు

మేషం

ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో స్ధిరాస్తివివాదాలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు వృత్తి, వ్యాపారాలలో నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది మానసిక ఒత్తిడి కలిగిస్తాయి.

వృషభం

వృత్తిఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు.నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. ఆదాయం పెరుగుతుంది.

మిధునం

కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలోనూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

కర్కాటకం

సోదరులతో వివాదాలు ఉంటాయి.ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు లో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించక అధికారులుతో మాటపడవలసి వస్తుంది.

సింహం

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచి చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి.

కన్య

సంతానానికి నూతన విద్య అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

తుల

నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. కుటుంబసభ్యులు సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. భూ సంభందిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

వృశ్చికం

తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఉద్యోగమున ప్రతికూలత పెరుగుతుంది.

ధనస్సు

ఆలోచనలు కలసిరావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.అకారణంగా బంధువులతో వివాదాలు ఉంటాయి కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు కలుగుతాయి నిరుద్యోగులకు శ్రమతో కాని ఫలితం అందదు.

మకరం

గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహన భూ లాభాలు. ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.

కుంభం

శ్రమతో కూడిన దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆకస్మిక విభేదాలు కలుగుతాయి. పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

మీనం

అనుకున్న పనులలో కార్యజయం కలుగుతుంది దాయాదులతో ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు.

Advertisement

Next Story

Most Viewed