- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అదృష్టం జలగపట్టుకున్నట్టు పట్టుకుంది!
by srinivas |

X
అనంతపురం జిల్లా వాసిని అదృష్టం జలగపట్టుకున్నట్టు పట్టుకుంది. పెనుగొండకు చెందిన సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి గూగుల్ పే ద్వారా తన స్నేహితుడికి మూడు వేల రూపాయలు పంపించాడు. స్నేహితుడికి ఆ డబ్బులు వెళ్లిన మరుక్షణం సూర్యప్రకాశ్ ఖాతాలో లక్ష రూపాయలు జమ అయినట్టు.. అతని బ్యాంక్ బ్యాలెన్స్ చూపించింది. దీంతో సూర్యప్రకాశ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. గూగుల్ పే ద్వారా డబ్బులు బదిలీ చేస్తే రివార్డుగా ఎంతో కొంత మొత్తాన్ని ఖాతాదారుకు అందజేస్తుంది. రూపాయి నుంచి లక్ష వరకు ఎంతైనా కావచ్చు. ఊహించని విధంగా లక్ష రూపాయల రివార్డ్ లభించేసరికి సూర్యప్రకాశ్ ఆనందంతో తన స్నేహితులకు చెప్పాడు. ఇది ఆనోటా ఈనోటా చేరి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
Next Story