- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త ఫీచర్స్‌తో Zoom….
దిశ, ఫీచర్స్: జూమ్ తన తాజా అప్‌డేట్‌లో కొన్ని కొత్త ఫీచర్స్ విడుదల చేస్తోంది. వినియోగదారులు ఇకపై ఇన్-ఆఫీస్ వర్క్‌స్పేస్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. క్లౌడ్ రికార్డింగ్స్, వీడియో మెయిల్స్ షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు అమెజాన్ ఫైర్ టీవీ యజమానులు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, జూమ్ కాల్స్ స్వీకరించొచ్చు. అయితే వీడియో కాలింగ్ కోసం 1080p వెబ్‌క్యామ్ అవసరం అవుతుంది. ఈ క్రమంలోనే జూమ్ న్యూ అప్‌డేట్స్‌లో ఇంకేం విశేషాలున్నాయో తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్‌లలో జూమ్ ఒకటి. అప్లికేషన్ ప్లాట్‌ఫామ్‌ను మెరుగుపరిచే, వీడియో కాన్ఫరెన్సింగ్ అనుభవంపై వినియోగదారులకు మరింత నియంత్రణను అందించే కొత్త ఫీచర్స్ హోస్ట్‌ను జూమ్ ఇటీవల ప్రకటించింది. ‘మీ సమావేశాల ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడానికి, మీ సహోద్యోగులను కలుసుకునేందుకు అదనపు మార్గాలను అందించడానికి, హైబ్రిడ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో ఘర్షణను తగ్గించడానికి మేము ఈ నెలలో అనేక ఉత్తేజకరమైన అప్‌డేట్స్, కొత్త ఫీచర్స్ విడుదల చేస్తున్నాం. వినియోగదారుడి భద్రత, గోప్యతను ఇది మెరుగుపరుస్తుంది’ అని జూమ్ పేర్కొంది.
జూమ్ సమావేశాలు..
మీటింగ్స్‌పై హోస్ట్ మరింత నియంత్రణను కలిగి ఉండటంతో పాటు, ఫోకస్ మోడ్ ప్రారంభించి జూమ్ మీటింగ్స్ షెడ్యూల్ చేయవచ్చు. ప్రతీ ప్రత్యేక సమావేశం ID కి ‘గ్యాలరీ వ్యూ’ సేవ్ అవుతుంది. ఇక్కడ హోస్ట్ ప్రతీ మీటింగ్‌లో కెమెరా ప్లేస్‌మెంట్‌ను మార్చేందుకు బదులుగా ప్రీసెట్స్ నుంచి లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. అందువల్ల సమయం ఆదా అవుతుంది.
జూమ్ చాట్..
మిస్డ్ వీడియో కాల్స్ ప్రస్తుతం చాట్‌లో కేంద్రీకృతమై ఉంటాయి. దీంతో మీరు మిస్ అయిన వాటిని త్వరగా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు చానెల్ లేదా సమావేశానికి కూడా మళ్లించబడతారు. అదనంగా, జూమ్ చాట్ ద్వారా పంపిన వీడియోలను వినియోగదారులు ఇకపై తమ మొబైల్ పరికరంలో సేవ్ చేసుకోగలరు. ఇక జిఫ్‌లన్నీ కూడా ఇన్‌బాక్స్‌లో కనిపిస్తాయి.
జూమ్ రూమ్..
వర్క్‌స్పేస్ రిజర్వేషన్ అనే ఇంటరాక్టివ్ మ్యాప్‌ని ఉపయోగించి వర్క్‌స్పేస్‌లను బుక్ చేసుకునేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. దీన్ని ఆన్-సైట్ లేదా రిమోట్‌గా యాక్సెస్ చేయవచ్చు. అప్‌డేట్ ఈ నెలలో పబ్లిక్ బీటా యాక్సెస్‌లో విడుదల చేస్తారు. మ్యాక్, విండోస్ ‘లోకల్-ఓన్లీ స్క్రీన్ షేర్’ యాక్సెస్‌కు కూడా ఈ ప్లాట్‌ఫామ్ మద్దతు అందించింది. ఈ ఫీచర్ గతంలో జూమ్ రూమ్స్ అప్లియెన్సెస్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది,
ఇంటి కోసం:
‘జూమ్ ఫర్ హోమ్’ ఫీచర్ ఇప్పుడు ఐప్యాడ్‌కు మద్దతును కలిగి ఉంది. వినియోగదారులకు వారి రిమోట్ లేదా ఆన్-సైట్ వర్క్‌స్పేస్‌ల కోసం సౌకర్యవంతమైన, స్థలాన్ని ఆదా చేసే పరికరాన్ని అందిస్తుంది. కొత్త పోర్ట్రెయిట్-ఆధారిత ఫ్రేమ్/టాబ్లెట్‌ను రూపొందించడానికి కంపెనీ నీట్ పరికరాలతో సహకరిస్తోంది. ఇది మీ గదిలో తక్కువ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా అత్యుత్తమ ధ్వనిని అందిస్తుంది.