బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం!

by Anukaran |   ( Updated:2021-12-03 11:21:47.0  )
Yuva Telangana party
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్​ఆకర్ష్​కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈనెల 9వ తేదీన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరేందుకు ఉద్యమకారుడు విఠల్,​తీన్మార్​మల్లన్న, రాణిరుద్రమ సిద్ధమైనట్లు తెలుస్తోంది. యువ తెలంగాణ పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​రాణి రుద్రమ కాషాయ తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలోనే ఆ పార్టీని సైతం బీజేపీలో విలీనం చేసేలా కాషాయ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. యువ తెలంగాణ పార్టీని జిట్టా బాలకృష్ణారెడ్డి స్థాపించారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు.

కాగా విలీనంపై రుద్రమదేవి, జిట్టా బాలకృష్ణారెడ్డి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాణి రుద్రమ బీజేపీ వైపు చూస్తుండగా జిట్టా మాత్రం కాంగ్రెస్​కు ఆకర్షితుడవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరువురికి పొసగడంలేదని టాక్. కాగా యువ తెలంగాణ పార్టీని బీజేపీలోకి విలీనం చేసే దిశగా కమలనాథులు తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై క్లారిటీ కోసం జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమకు ‘దిశ’ ఫోన్ లో సంప్రదించినా స్పందించలేదు.

బీజేపీలో చేరే వారికి పార్టీ గేట్లు ఎప్పటికీ తెరిచే ఉంటాయని ఇటీవల పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్​చుగ్​ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాణిరుద్రమకు బీజేపీ నేతలు టచ్​లో ఉండి యువతెలంగాణ పార్టీని విలీనానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ పార్టీయే కాక మరో పార్టీ విలీనానికి సైతం బీజేపీ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడితో కాషాయ శ్రేణులు చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ఉద్యమ నాయకులు, ఓటర్లను ప్రభావితం చేసే శక్తి ఉన్న వ్యక్తులపై కమలనాథులు ప్రత్యేక ఫోకస్​పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. హుజురాబాద్​లో ఈటల గెలుపు అనంతరం ఆపరేషన్​ఆకర్ష్​జోరుగా సాగుతోంది.

ఇప్పటికే ఆయన ఉద్యమకారులందరినీ బీజేపీలోకి వచ్చి చేరాలని పిలుపునిచ్చారు. జిల్లాలవారీగా పర్యటనలు చేస్తూ ఉద్యమకారులను ఒక్కొక్కరిని కలిసి వస్తున్నారు. టీఆర్ఎస్​లో ఉద్యమకారులకు అవమానమే తప్పా గుర్తింపు ఉండదని వారికి చెబుతున్నారు. అంతేకాక ఇప్పటికే ఎంతోమంది నేతలు తనతో టచ్ లో ఉన్నట్లు ఆయన గతంలోనే చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపే శ్రేణులు ముందుకు వెళ్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed