- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌ది గోల్ మాల్ రాజకీయం.. సంక్షేమం అంటేనే YSR..
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ ఏటా బడ్జెట్‌ను పెంచి గోల్మాల్ చేస్తోందని వైస్సార్‌టీపీ తుడి దేవేందర్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ స్కీమ్స్ పేరుతో స్కామ్‌లు చేస్తున్నదని మండిపడ్డారు. ఏడేళ్లలో ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తూ అదే అభివృద్ధిగా భ్రమ పడుతున్నారని విమర్శించారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఎంపీటీసీలకు కూడా నిధులు మంజూరు చేయడం లేదన్నారు.
రాష్ట్రంలో రైతులకు కూడా న్యాయం చేయడంలేదని ఆరోపించారు. పేదలు మరింత పేదరికంలోకి వెళ్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం అంటేనే YSR అని స్పష్టం చేశారు. ఇప్పటికీ YSR అమలు చేసిన పథకాలు పేదల మనసులో ఉన్నాయని తెలిపారు. ఆ నాయకుడి కుటుంబం నుంచి వచ్చిన షర్మిలను ఆదరించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
పేద ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైస్సార్‌టీపీ ఈనెల 20 నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజులు 4,000 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కలలు నెరవేరాయా.? లేదా అనే విషయాలను తెలుసుకుంటామన్నారు. చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మీదుగా యాత్ర కొనసాగుతుందన్నారు.