ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన

by srinivas |
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సంతనూతలపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆందోళనకు దిగారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో అర్హులకు ఇళ్లు మంజూరు చేయడంలేదని ఆరోపిస్తూ, తన అనుచరులతో ఆందోళన చేపట్టారు. ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ పోలా భాస్కర్‌కి ఫిర్యాదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు.

Advertisement

Next Story