ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్ ఫలితాల్లో వికసించిన జలజం విద్యార్థులు..

by Kalyani |
ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్ ఫలితాల్లో వికసించిన జలజం విద్యార్థులు..
X

దిశ, పాలమూరు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్ కు పెట్టింది పేరు అయిన జలజం జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఎంఈసీ ప్రథమ సంవత్సరం ఫలితాలలో హృషికేష్ రెడ్డి 500 మార్కులకు గాను 489, చాహత్ అగర్వాల్ 488, జి. నిశాంత్ 486 మార్కులను సాధించారు. సీఈసీ విభాగంలో ఎన్. సాహితీ 489, జీ. వైష్ణవి 483, సి. సాయి దీపిక 478 మార్కులు సాధించారు. హెచ్ఈసీ విభాగంలో కేఈ జాన్ అబ్రహం 408, ఎం. మణికంఠ 404, పి. రణదేవ్ 391 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంఈసీ విభాగంలో బి. వినయ్ 1000 మార్కులకు గాను 979 మార్కులను సాధించగా బి. శివకుమార్ 953, జువేరియా ఫర్హత్ 938, ఈసీ విభాగంలో వేదిక బంగ్ 966, ఎన్. విద్యావతి 946, బి. శివానంద్ 945, హెచ్ఈసీ విభాగంలో ఎన్. లక్ష్మీబాయి 951, వై. అజయ్ 915, ఎన్. శ్రీహర్ష 757 మార్కులను సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ రమేష్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ షకీల్, అధ్యాపకులు కల్పన, శాంతకుమారి, రజిత, కృష్ణ, జ్యోతి, రహమత్, పవన్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.



Next Story