షర్మిల కీలక నిర్ణయం.. దీక్షలకు బ్రేక్

by Shyam |
షర్మిల కీలక నిర్ణయం.. దీక్షలకు బ్రేక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. కార్యకర్తలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొలువుల సాధన కోసం జరిగే పోరాటం కొనసాగుతూ ఉంటుందని, కరోనా విజృంభణ తగ్గిన తర్వాత మళ్లీ నిరాహార దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. అప్పటి వరకు కార్యకర్తలు, ప్రజలు కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed