- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాస్పిటళ్లు కట్టడం సంతోషం.. మరి రైతుల సంగతేంది? – వైఎస్ షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో : “దొంగలు పడిన ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు కరోనా వచ్చిన ఏడాదికైనా సీఎం కేసీఆర్ సారు మేల్కొని ఆదిలాబాద్, వరంగల్ లలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషమని” వైఎస్ షర్మిల సోమవారం ట్వీట్ చేశారు. ఇప్పటికైనా హాస్పిటళ్లు కట్టడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె.. మరి మిర్చి రైతుల సంగతేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మిర్చి రైతుల ఇబ్బందులను కూడా కాస్త పట్టించుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో మిర్చి మార్కెట్లు బంద్ చేసి ఇప్పటికే 25 రోజులు దాటిపోతోందని, మార్కెట్లలో పంటను అమ్ముకోలేక, రైతులు తమ ఆర్థిక అవసరాలకోసం తక్కువ ధరకే పంటలను దళారులకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. దీనివల్ల క్వింటాల్ కు రూ.నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మిర్చి రైతులు మరింత నష్టపోకముందే మార్కెట్లను తెరవాలని ఆమె డిమాండ్ చేశారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకొని ప్రాణనష్టాన్ని నివారించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
దొంగలు పడ్ద ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు.. కరోనా వచ్చిన ఏడాదికైనా KCR సారు .. మేల్కొని,
ఆదిలాబాద్, వరంగల్ లలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ తక్షణమే నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషం.
కానీ రాష్ట్రంలో మిర్చి రైతుల ఇబ్బందులను కూడా కాస్త పట్టించుకోవాలని కోరుతున్నాం. 3/1— YS Sharmila (@realyssharmila) May 10, 2021