యూట్యూబ్‌లో ‘బెడ్ టైమ్’ రిమైండర్

by vinod kumar |
యూట్యూబ్‌లో ‘బెడ్ టైమ్’ రిమైండర్
X

దిశ, వెబ్‌డెస్క్ :
సినిమాలు, పాటలు, కామెడీ బైట్స్, టీవీ షో, డ్యాన్స్‌లు, ఇన్‌స్పిరేషన్ వీడియోలు.. ఒక్కటేమిటి అన్నింటినీ కలిపి మిక్చర్ పొట్లంలా అందించేది ‘యూట్యూబ్’. ఆ ప్రపంచంలోకి వెళ్తే.. టైమ్ అనేదే తెలియదు. గంటలు గడుస్తున్నా.. ఫోన్ పట్టుకుని అలా వీడియోలు చూస్తూనే ఉంటాం. ఉదయం ఉద్యోగం, వ్యాపారాల్లో బిజీగా ఉండే వాళ్లతోపాటు చాలామంది యువతకు కూడా రాత్రి వేళల్లోనే యూట్యూబ్ చూసే సమయం చిక్కుతుంది. అలా చాలామంది నైట్‌ టైమ్‌లో యూ ట్యూబ్ చూస్తూ.. నిద్రను దూరం చేసుకుంటున్నారని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్లే.. యూ ట్యూబ్ ‘బెడ్ టైమ్ రిమైండర్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

లేట్ నైట్ బాధితులను త్వరగా నిద్రపుచ్చేందుకు యూట్యూబ్ ప్రత్యేకంగా ఈ ‘బెడ్ టైమ్ రిమైండర్’ను తీసుకొచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే ఇదో అలారమ్. యూట్యూబ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ సెట్టింగ్స్‌ క్లిక్ చేస్తే ‘ద టేక్ బ్రేక్ రిమైండర్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసి.. మనకు నచ్చిన టైమ్‌ను అందులో సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. 60 నిమిషాల పాటు యూట్యూబ్ చూస్తామని సెట్ చేసుకుంటే.. ఆ టైమ్ దాటగానే యూట్యూబ్ నుంచి మనకు ఓ మెసేజ్ వస్తుంది. అంతేకాదు యూట్యూబ్‌లో ఎంత సమయం గడిపామో తెలుసుకునేందుకు యూజర్లకు స్టార్ట్ టైమ్, ఎండ్ టైమ్ కూడా సెట్ చేసుకునే వీలు కల్పించింది. యూట్యూబ్‌ను ఫోన్‌లో చూసేవారికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. ల్యాప్ టాప్, డెస్క్ టాప్ వినియోగదారులకు కూడా త్వరలోనే ఈ ఫీచర్‌ను చేర్చుతామని సంస్థ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed