గూగుల్ అకౌంట్ మార్చకుండానే.. యూట్యూబ్ చానెల్ పేరు మార్పు

by Shyam |
Google account
X

దిశ, ఫీచర్స్: యూట్యూబ్ క్రియేటర్స్ వారి గూగుల్ ఖాతాను చేంజ్ చేయకుండా తమ చానెల్ పేరు, ప్రొఫైల్ చిత్రాన్ని మార్చుకునేందుకు యూట్యూబ్ అనుమతిస్తోంది. ఇప్పటి వరకు YouTube చానెల్ పేరు లేదా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చితే అది గూగుల్ అకౌంట్‌తో పాటు జీమెయిల్‌లో రిఫ్లెక్ట్ అయ్యేది. కానీ ఇకమీదట అలా జరగదు.

యూట్యూబ్, జీమెయిల్, ఇతర సేవలకు ఒకే గూగుల్ ఖాతాను మాత్రమే వినియోగించుకోవాలనుకునే కంటెంట్ క్రియేటర్స్‌కు ఈ న్యూ అప్‌డేట్ సాయపడుతుంది. చానెల్ పేరు మార్పు కోసమే క్రియేటర్స్ మరొక గూగుల్ ఖాతాను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఉన్న యూట్యూబ్ సృష్టికర్తలు తమ చానెల్ పేరును మార్చుకుంటే ఆ బ్యాడ్జ్ కోల్పోతారు. ఈ అప్‌డేట్ తర్వాత వారి చానెల్ పేరును మార్చుకోవాలనుకునే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. కానీ బ్యాడ్జ్ లేని ఇతరులకు ఈ మార్పు వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. వ్యక్తిగత యూట్యూబర్‌ల‌తో పాటు బ్రాండ్ అకౌంట్స్ కూడా ఇకమీదట తమ చానెల్ పేర్లను మార్చడం ప్రారంభించవచ్చు. యూట్యూబర్స్ ఎప్పటినుంచో ఈ ఆప్షన్ కావాలని కోరుకుంటుండగా, తాజాగా ఈ అప్‌డేట్ తీసుకొచ్చింది యూట్యూబ్.

ఎలా చేంజ్ చేయాలి ?

– మొదట డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ స్డూడియో ఓపెన్ చేయాలి. మెనూ బార్ స్క్రోల్ డౌన్ చేసి, కస్టమైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి.
– చానెల్ పేరును మార్చడానికి ‘బేసిక్ ఇన్ఫో’ సెలెక్ట్ చేసి, పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. అక్కడ చానెల్ నేమ్ రాసేసి ఓకే చేస్తే సరిపోతుంది.
– అదే మొబైల్‌లో అయితే, ప్రొఫైల్ పిక్చర్ ఓపెన్ చేయాలి. ‘యువర్ చానెల్’ మీద ట్యాప్ చేసి ఎడిట్ చానెల్ మీద క్లిక్ చేయాలి. ఆపై పెన్సిల్ ఐకాన్‌ను ట్యాప్ చేసి చానెల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed