- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఇదే!

దిశ, వెబ్ డెస్క్: హిందువులు.. ఉగాది, దసరా, దీపావళి అంటూ చాలా పండుగలు జరుపుకుంటారు. కానీ, క్రైస్తవ మతస్థులకు ఏడాదిలో రెండు, మూడు పండుగలు మాత్రమే ఉంటాయి. అందులో ముఖ్యమైనవి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఇక గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది ఈస్టర్ ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారు. ఇది మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. మరీ క్రైస్తవులు దేవుడిగా ఆరాధించే యేసు ప్రభువును గుడ్ ఫ్రైడే నాడు శిలువ వేస్తారు కదా.. దాన్ని గుడ్ అని ఎందుకు అంటున్నారు? ఇవాళ (ఏప్రిల్ 18) గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ పండుగ విశిష్టత, ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలు తెలుసుకుందాం.
మనలో చాలా మంది గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవులకు మంచి రోజు అని, సంతోషంగా పండుగ జరుపుకుంటారని అనుకుంటారు. అందుకు కారణం.. ఆ పదంలో 'గుడ్' అంటే శుభం అని ఉండటమే. కానీ, ఈ రోజున క్రైస్తవులు సంతోషంగా ఉండరు. చర్చిల్లో ప్రార్థనలు చేసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఒకరినొకరు ఓదార్చుకుంటారు. తమ ప్రభువైన యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే.. గుడ్ ఫ్రైడే రోజునే జీసస్ తన ప్రాణాలను సిలువపై పణంగా పెట్టాడు.
బైబిల్ ప్రకారం.. యేసుక్రీస్తు ఆ కాలంలోనే ప్రేమ, కరుణ, క్షమాపణ గొప్పతనాన్ని చెబుతూ ప్రజల్లో సందేశాలు ఇచ్చేవారు. దీన్ని అప్పటి రాజకీయ నాయకులు తమకు ముప్పుగా భావించేవారు. దీంతో అతనిపై రాజ ద్రోహం, దైవ దూషణ వంటి అభియోగాలను మోపి.. అరెస్టు చేసే శిలువ వేయమని శిక్ష విధించారు. రోమన్ గవర్నర్ పొంటియస్ పిలాతు ఆదేశం మేరకు యేసుక్రీస్తును శిలువ వేశారు. యేసు శిలువ వేసిన రోజు శుక్రవారం. దీన్నే గుడ్ ఫ్రైడే అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇక గుడ్ ఫ్రైడే జరిగిన మూడోరోజు అంటే ఆదివారం రోజు క్రైస్తవులు ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అదే ఈస్టర్ పండుగ. ఆరోజు యేసు మరలా ప్రాణాన్ని తెచ్చుకొని ప్రజల్లోకి వచ్చాడని చెబుతారు. ఈ రోజున ప్రభువును గుర్తు చేసుకుని ఒకరికొకరు బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒకొక్కరూ ఒక్కొక్క పద్దతిని పాటిస్తారు. కొందరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనను ముగించేందుకు సూచనగా 33 సార్లు చర్చి గంటను మోగిస్తారు. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ కూడా జీసస్ పుట్టుక గురించి ఆయన పుట్టిన తేదీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రభువును శిలువ వేయడాన్ని గురించిన ప్రస్తావన మాత్రం బైబిల్‌లో ఉంది.
గమనిక : పైన తెలిపిన వివరాలు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.