చనిపోతున్నానంటూ యువకుడి సెల్ఫీవీడియా..

by  |
చనిపోతున్నానంటూ యువకుడి సెల్ఫీవీడియా..
X

దిశ, సూర్యాపేట: తాను చనిపోతున్నానంటూ ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో సెల్ఫీ వీడియో పోస్టు చేసి ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సెల్‌ఫొన్ నెట్‌వర్క్ సిగ్నల్ ఆధారంగా అతన్ని కనిపెట్టి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని చివ్వేంల మండలం బి. చందుపట్ల గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి అనే యువకుడు ఇంట్లో కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నానంటూ ఫేస్‌బుక్‌లో శనివారం సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా యువకుడు కృష్ణా జిల్లా ప్రేనుగంచి ప్రోలు వద్ద ఉన్నట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆదేశాల ప్రకారం మూడు బృందాలుగా విడిపోయి యువకుని కోసం గాలించారు.

కృష్ణా జిల్లా పోలీసులు, చందుపట్ల గ్రామం యువకులతో కలిసి ప్రెనుగంచిప్రోలు పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ చివరకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లబి గ్రామం (కృష్ణా- ఖమ్మం బోర్డర్‌లో) యువకున్ని క్షేమంగా అదుపులోకి తీసుకుని చివ్వేంల పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆ యువకునికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

Read also…

నేరేడుచర్లలో దొంగల బీభత్సం..


Next Story

Most Viewed