బాలికను బాత్రూంలోకి తీసుకెళ్లి…

by srinivas |
బాలికను బాత్రూంలోకి తీసుకెళ్లి…
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తులో ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. ఒంటరిగా ఉన్న బాలికను బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు. ఈ క్రమంలో బాలిక ఏడుపు విన్న స్థానిక మహిళలు వెంటనే యువకుని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఈ దాడిలో బాలికకు స్వల్పగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లా కేంద్రంలోని పద్మావతినగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

Advertisement

Next Story