‘దోస్తులు నేను పోతున్నా… అంటూ ఆత్మహత్య’

by Anukaran |   ( Updated:2020-09-13 11:42:27.0  )
‘దోస్తులు నేను పోతున్నా… అంటూ ఆత్మహత్య’
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ‘ఎవరినీ ప్రేమించకండి, ప్రేమిస్తే చచ్చేవరకూ ఉండే వాళ్లను మాత్రమే ప్రేమించండి. ఎందుకంటే ఇది లైఫ్, లైఫ్ ఎలా ఉండాలి అంటే హ్యాపీగా ఉండాలి. మనం అనుకున్న వాళ్లు మనతో లేకుంటే హ్యాపీగా ఉండలేం. రాజన్నా, గల్లీ దోస్తులు, టెన్త్ దోస్తులు నేను పోతున్నాను రా’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌లో కలకలం సృష్టించింది.

కరీంనగర్‌ పట్టణంలోని సప్తగిరి కాలనీ రోడ్ నెంబర్-5లో నివాసం ఉంటున్న సాయి అనే యువకుడు సెల్ ఫోన్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం లోయర్ మానేరు డ్యాం కట్టపై విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సాయి ఆదివారం చనిపోయాడు. విషయం తెలసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు కరీంనగర్ టూ టౌన్ సీఐ తాత లక్ష్మీ బాబు తెలిపారు.

Advertisement

Next Story