యెస్ బ్యాంకు ఖాతాదారుల సొమ్ము సేఫ్ : నిర్మలా సీతారామన్ హామీ

by Shyam |   ( Updated:2020-03-06 09:25:38.0  )
యెస్ బ్యాంకు ఖాతాదారుల సొమ్ము సేఫ్ : నిర్మలా సీతారామన్ హామీ
X

దిశ, న్యూస్ బ్యూరో: యెస్ బ్యాంకు ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. ఆ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఈ విషయమై ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. యెస్ బ్యాంకుకు నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆసక్తి చూపిందని తెలిపారు. యెస్ బ్యాంకు అంశంపై ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతాదాస్ తో మాట్లాడామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఖాతాదారులు, బ్యాంక్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి ఖాతాదారులు రూ.50వేల వరకు తీసుకునేలా ఏర్పాట్లు చేయడమే తమ ముందున్న తొలి ప్రాధాన్యమన్నారు.

యెస్ బ్యాంకు పునర్నిర్మాణానికి కృషి : చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్

యెస్ బ్యాంకు పునర్మిర్మాణానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తున్నామని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ తెలిపారు. ఖాతాదారుల సొమ్ము భద్రంగా ఉందని హామీ ఇచ్చారు.

యెస్ సమస్యకు త్వరలో పరిష్కారం : ఆర్బీఐ గవర్నర్ దాస్

ఈ సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపేందుకు ఆర్బీఐ కృషి చేస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాదాస్ హామీ ఇచ్చారు. యెస్ బ్యాంకు విషయంలో తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నవని చెప్పారు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇదే సరైన సమయం అని దాస్ అన్నారు.

Tags : yes bank, nirmala sitharaman, krishnamurthy, shaktikanta das

Advertisement

Next Story

Most Viewed