- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి తలనొప్పిగా మారిన రఘురామకృష్ణంరాజు
దిశ, వెబ్‌డెస్క్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీకి తలనొప్పిగా మారారు. అధికార పార్టీ ఎంపీగా ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో తప్పులను ఎత్తి చూపడం ద్వారా పార్టీ ఆగ్రహానికి గురయ్యారు.ఈ నేపథ్యంలోనే షోకాజ్ నోటీసు కూడా అందుకున్నారు. దానిపై కూడా ప్రశ్నించడంతో ఇక అతని వ్యవహారం అటో, ఇటో తేల్చేయాలని వైసీపీ అధినాయకత్వం కృతనిశ్చయంతో ఉంది. దీంతో వైసీపీ ఎంపీలు శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.అనంతరం స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌ను కోరనున్నారు.
అయితే, షోకాజ్ నోటీసు అందుకున్న ఎంపీ సంజాయిషీ ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసులనే ప్రశ్నించడం ద్వారా మరింత ఆజ్యం పోశారు. వైసీపీ హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణంరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడన్నది వైసీపీ నేతల ఆరోపణ. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఎంపీ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్‌ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు. రేపు వైసీపీ ఎంపీలు కూడా స్పీకర్‌ను కలవనుండటంతో ఈ అంశంలో మరింత ఆసక్తి ఏర్పడింది.