అంగన్ వాడీ పోస్టుల విషయంలో కొట్లాట..

by srinivas |
అంగన్ వాడీ పోస్టుల విషయంలో కొట్లాట..
X

దిశ, వెబ్‌డెస్క్ : అంగన్ వాడీ పోస్టుల విషయంలో అధికార వైసీపీకి చెందిన రెండు వర్గాలు కొట్లాటకు దిగాయి. ఆ పోస్టుల్లో తమవారికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి.
ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కొత్తకోటలో సోమవారం వెలుగులోకి వచ్చింది.

మాటల యుద్ధం కాస్త శృతిమించడంతో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు.ఈ తగవులాటలో 8 మందికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని గొడవకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story