- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైసీపీ ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్యాయత్నం

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బళ్లారి ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి కుమారుడు శ్రవణ్‌రెడ్డితో కలిసి ప్రవీణ్ కుమార్ ఓ కార్ల షోరూమును ప్రారంభించారు. మొదట్లో వ్యవహారాలు సాఫీగా సాగినా, రానురాను లావాదేవీల్లో తేడాలొచ్చినట్లు తెలుస్తోంది.
అయితే షోరూంకు సంబంధించిన లెక్కల విషయంలో ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. లెక్కలు చెప్పాలని గట్టిగా నిలదీయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్ కుమార్ షోరూంలోనే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన స్నేహితులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే గాలి కుటుంబ సభ్యులు గానీ..ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిగానీ ఈ ఆత్మహత్యాయత్నంపై పెదవి విప్పకపోవడం గమనార్హం.