- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్కాం బాబు చంద్రబాబు..సూట్‌కేస్ బాబు చినబాబు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు, లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉంటే ఇవ్వాలని, ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. దివాళ తీసిన టీడీపీకి చంద్రబాబు అధ్యక్షుడని మండిపడ్డారు. గాలి వార్తలు రాసే పత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా ప్రధానికి లేఖ రాస్తారా చంద్రబాబు అని ప్రశ్నించారు.
అంతర్జాతీయ అవినీతి సంఘానికి చంద్రబాబు అధ్యక్షుడని.. స్కాం బాబు అంటే చంద్రబాబని, సూట్‌కేస్ బాబు అంటే చినబాబు అని ఎద్దేవా చేశారు. లోకజ్ఞానం లేని లోకేష్‌పై వాలంటరీని పోటీకి పెట్టి గెలిపిస్తామని.. ఈ సవాల్‌కు చంద్రబాబు స్పందించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు.
Next Story