రికెల్‌టన్‌ను నాటౌట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్.. వరుణ్ చక్రవర్తి హాట్ కామెంట్స్

by Shiva |
రికెల్‌టన్‌ను నాటౌట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్.. వరుణ్ చక్రవర్తి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025 (IPL-2025) సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అపజయాల పరంపర కొనసాగుతోంది. వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా గురువారం ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆరెంజ్ ఆర్మీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదో ఓటమి. అయితే తొలుత టాస్ గెలిచిన ముంబై అనూహ్యంగా బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (40), ట్రావిస్ హెడ్ (29) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఇషాన్ కిషన్ (2) పరుగులతో మరోసారి నిరాశపరిచాడు. ఇక నితీశ్ కుమార్ రెడ్డి (19), హెన్రిచ్ క్లాసెన్ (37) పరుగులతో కాసేపు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అనంతరం వచ్చిన అనికేత్ వర్మ (18), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (8) కూడా దూకుడుగా ఆడటంతో ఎస్ఆర్‌హెచ్ 162 పరుగులు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, ట్రెండ్ బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రియాన్ రికల్టన్ (31), రోహిత్ శర్మ (26), విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, మ్యాచ్ మధ్యలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లాంగ్‌ ఆఫ్‌లో జిషాన్ అన్సారీ (Zeeshan Ansari) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయిన రియాన్ రికల్టన్‌ (Ryan Rickelton)ను థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే, బౌలర్ బాల్ వేస్తున్న సమయంలో కీపర్ క్లాసెన్ గ్లోవ్స్ వికెట్ల కంటే ముందు ఉన్నట్లుగా టీవీ రీప్లైలో తేలడంతో రికల్టన్‌ను నాటౌట్‌గా ప్రకటిచడం చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఇదే అంశంపై తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోయినా.. బౌలర్‌కు ఎందుకు ఆ శిక్ష అంటూ ప్రశ్నించాడు. కీపర్ గ్లోవ్స్ స్టంప్స్ ముందుకు వస్తే అది నోబాల్ లేక డెడ్‌బాల్ అయి ఉండాలి. కీపర్‌కి వార్నింగ్ ఇవ్వాలి. మళ్లీ కీపర్ అలా చేయడు అని అన్నాడు. కానీ, ఏ తప్పు చేయని బౌలర్‌కు ఎందుకు ఆ శిక్ష అంటూ వరుణ్ చక్రవర్తి ట్విట్టర్ వేదికగా అసహన వ్యక్తం చేశాడు.



Next Story