- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైసీపీ ఎమ్మెల్యే.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల ప్రచారం అంటేనే పదనిసలు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం అలవాటే. తమకే ఓటు వేయాలని కోరుతూ ప్రత్యర్థి అభ్యర్థిని తిట్టిపోస్తూ వారికి ఓటు వేయవద్దని కోరుతుంటారు. పొద్దునుంచి రాత్రి వరకు ఎదుటి వారిపై ఆరోపణలు గుప్పిస్తుండడంతో ప్రత్యర్థి పార్టీ, పేరు వీరి నోట్లో నానుతుందనడంతో సందేహం లేదు. ఎదుటి పార్టీని తిడుతూ తిడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే తన పార్టీకి ఓటేయాలని కోరకుండా టీడీపీకి ఓటేయాలని కోరడంతో ప్రచారంలో నవ్వులు పూశాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరులో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి జయలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి గంటా శ్రీలక్ష్మి తరఫున ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాసుబాబు.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని కార్యకర్తలను కోరాడు. ఆయన మాటలకు అక్కడ ఉన్న వారిలో షాక్ అయ్యారు. అభ్యర్థులు మాత్రం ఖంగుతిని ఎమ్మెల్యే వైపు చూశారు. వెంటనే తేరుకున్న ఎమ్మెల్యే సైకిల్ గుర్తుకు ఓటేయాలని జోక్ చేశానని సర్ధి చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ యూత్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో వైరల్ గా మారింది.