- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్‌లో ఏపీకి మొండి చేయి :విజయసాయిరెడ్డి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండి చేయి చూపారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు చెందిన బడ్జెట్‌లా ఉందన్నారు. మెట్రోరైలు కోసం ఆరేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నామని.. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్టు కేటాయించలేదని తెలిపారు. కిసాన్ రైళ్ల గురించి సీఎం ఎన్నోసార్లు కోరినా బడ్జెట్‌లో ప్రస్తావించలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై కేంద్రానికి శ్రద్ధ లేనట్టుందని విజయసాయి రెడ్డి విమర్శించారు.
కరోనా వ్యాక్సిన్ తప్ప ఏపీకి ఒరిగిందేమి లేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి వైరాలజీ, టెక్స్‌టైల్ కేంద్రాలతో పాటు కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు రూ.10 వేలు ఇవ్వాలని కోరామన్నారు. ఇది కేంద్ర బడ్జెట్ కాదు.. కేరళ, అసోం, బెంగాల్, తమిళనాడు బడ్జెట్ అన్నారు.
Advertisement
Next Story