- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘భారత్‌లో ఈవీల తయారీలో సవాళ్లు ఉంటాయి’
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో తన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహానాలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ పెట్టుబడులు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ప్రభుత్వం తీసుకునే విధానాలు, స్పష్టమైన రోడ్‌మ్యాప్‌పై ఆధారపడి ఉంటుందని కంపెనీ అభిప్రాయపడింది. ప్రభుత్వం ఇప్పటికే ఫేమ్2 పథకం ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రత్యేక సబ్సిడీని ఇస్తోంది. అయితే, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి సహా ఇతర అనేక మౌలిక సదుపాయాల్లో సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని అధిగమించేందుకు పరిష్కారాలను అందించాలని యమహా మోటార్ తెలిపింది.
‘ఇప్పటికే యమహా భారత్, ఇతర ప్రపంచ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ వాహనాలను తీసుకొచ్చేందుకు పనిచేస్తోంది’ అని యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ మొటోఫుమి అన్నారు. భారత్‌లో గణనీయంగా పెట్టుబడులు పెట్టేందుకు సవాళ్లను ఎదుర్కొంటున్నామని, ఈ అవరోధాలను గట్టేక్కేందుకు స్థిరమైన విధానాలు, స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఈ సమస్యల పరిష్కారం అనంతరం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడంతో పాటు తయారీ కూడా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, యమహా మోటార్ ఇండియా ఇప్పటికే ఫాసినో 125 హైబ్రిడ్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.