- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎదురు సొమ్మిచ్చి చమురు తీసుకెళ్లమంటున్నారు.. ఎక్కడ?
దిశ, వెబ్‌డెస్క్: చరిత్రలో ఎన్నడూ చూడని వింత. అమెరికా చమురు మార్కెట్‌కు చమురెక్కువ అంటుకుని ధరలు అగాథంలోకి జారిపోయాయి. మే నెల నుంచి అందుబాటులోకి రానున్న చమురు ధరల తగ్గింపు ఊహించని స్థాయిలో కేవలం ఒక్కరోజే వంద శాతానికి పైగా పడిపోయింది. ఎమ్‌సీఎక్స్ మార్కెట్లు ముగిసే సమయానికి బ్యారెల్ ధర -37 డాలర్లకు పడిపోయిందంటే దాన్ని ఊహించగలమా!? మే నెలలో ముడి చమురు సరఫరాకు ఏప్రిల్ 21తో ఒప్పందం ముగుస్తుంది. అయితే, ఇంతవరకూ ముడిచమురు కొనడానికి పెట్టుబడిదారులెవరూ ముందుకు రాలేదు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ దీనికి ప్రధాన కారణం.
చమురు ఉత్పత్తిదారుల వద్ద ఉన్న నిల్వలు నిండిపోయి నింపడానికి ఖాళీ లేదని, కొనుగోలు చేసే దేశాలకే ఎదురు సొమ్ము చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. అంతర్జాతీయంగా లాక్‌డౌన్ వల్ల ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో చమురు వాడకం తగ్గి డిమాండ్ పూర్తిగా పడిపోయింది. డిమాండ్ లేకపోవడం వల్ల మిగిలిన సరఫరా నిల్వల కోసం ఉత్పత్తిదారులు ట్యాంకర్లను అద్దె తెచ్చుకుంటున్నారు. దీంతో అమెరికా చమురు ధరలు మైనస్‌లోకి జారాయి.
అమెరికా ప్రామాణికమైన డబ్ల్యూటీఐ చమురు ధర బ్యారెల్‌కు మైనస్ 37.63 డాలర్లకు తగ్గిపోయింది. ‘ఊహించనిస్థాయిలో షాక్ తగిలింది. ఇది చరిత్రలో ఎప్పుడూ లేని పతనమని’ ఇంధన విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, సోమవారం పతనమైన ధరలకు అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో సాంకేతిక అంశం కూడా కారణమని, మాములుగా చమురు బిజినెస్ భవిష్యత్ ధరల ప్రకారం జరుగుతుంది. మే నెలకు సంబంధించి మంగళవారం గడువు ముగుస్తుండటం కూడా ధరల పతనానికి కారణం. చమురు వ్యాపారులు ఇదివరకే కొన్న చమురును డెలివరీ ఆర్డర్ తీసుకోవాలి. నిల్వకు అయ్యే ఖర్చు నుంచి తప్పించుకోవడానికి డెలివరీ లేకుండానే నిల్వలను వదిలించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. మే నెలకు తోడు డబ్ల్యూటీఐ జూన్ ధరలు కూడా పతనమైనప్పటికీ నిలకడగా బ్యారెల్‌కు 20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికా చమురుకు తోడు, యూరప్ సహా మిగిలిన ప్రపంచ దేశాలు ఉపయోగించే బ్రెంట్ క్రూడ్ జూన్ ధరలు ఇప్పటికే 8.9 శాతం తగ్గి బ్యారెల్‌కు 26 డాలర్లకు పడిపోయాయి. అమెరికా చమురు ధరలు మైనస్‌కు చేరడం చూస్తుంటే చమురు మార్కెట్ ఏ స్థాయి ఒత్తిడిని ఎదుర్కొంటుందో తెలుస్తోందని, లాక్‌డౌన్ కొనసాగించినట్టైతే జూన్ ధరలు కూడా దిగజారవచ్చని ఇంధన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా చమురు మార్కెట్లు బ్రిటన్ ఉత్పత్తి చేసే బ్రెంట్ మీదా నేరుగా ప్రభావం చూపించే అవకాశముంది.
చమురు పరిశ్రమ.. క్షీణిస్తున్న డిమాండ్‌కు తోడు ఉత్పత్తిని తగ్గించే విషయంపై ఉత్పత్తిదారుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటివారంలో ఒపెక్ సభ్యులు, దాని మిత్రదేశాలు ప్రపంచ వ్యాప్త ఉత్పత్తిని 10 శాతం తగ్గించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ స్థాయిలో చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒప్పందం జరగడం ఇదే తొలిసారి. కానీ.. అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తే ఇప్పుడు తగ్గించిన మొత్తం కూడా సరిపోదని అనేకమంది విశ్లేషకులు అంటున్నారు. చమురు మార్కెట్లకు ఈ ఒపెక్, మిత్ర దేశాల ఒప్పందం ప్రస్తుతం ఏమాత్రం సరిపోదని మార్కెట్ గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదని ఇంధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tags : Wti Crude Price, BrentOil, Why Did Crude Oil Prices Fall Prices,WTI, Crude